Tuesday 20 December 2011

soorya to host reality show on tv.....

అమితాబ్ బచ్చన్ స్ఫూర్తితో ఒక్కొక్కరూ బుల్లితెరకు వస్తున్నారు. త్వరలో తమిళ బిజీ కథానాయకుడు సూర్యా కూడా ఈ లిస్టులో చేరుతున్నాడు. టీవీలో ఓ రియాలిటీ షోని హోస్ట్ చేస్తాడు. హిందీలో పాప్యులర్ అయిన 'కౌన్ బనేగా కరోడ్ పతి' తమిళ వెర్షన్ ని నిర్వహించడానికి సూర్యా అంగీకరించాడట. ఇందు కోసం నెలకి ఆరు రోజులు కేటాయిస్తున్నాడు. ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్నందుకు ఆయనకు భారీ పారితోషికమే ముడుతున్నట్టు తెలుస్తోంది. త్వరలో ఫస్ట్ ఎపిసోడ్ చిత్రీకరణ ప్రారంభం కానుంది. అందు కోసం ఇప్పటి నుంచే మన హీరో ప్రాక్టీస్ చేస్తున్నాడు. చెన్నయ్ వడపళనిలోని ఓ స్టూడియోకి ప్రతి రోజూ ఉదయమే వచ్చి రిహార్సల్స్ లో పాల్గొంటున్నాడు. సో... ఈ గజనీ స్టార్ని త్వరలోనే తమిళ బుల్లితెరపై కూడా చూసి ఆనందించవచ్చు!

No comments:

Post a Comment

Hyderabad

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2013. cininewsportal - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger