Sunday 18 December 2011

సంక్రాంతి తర్వాత వెంకీ కొత్త సినిమా ........ new movie of venkatesh

కొంతమంది దర్శకులు హీరోలకు కథ అద్భుతంగా చెబుతారు. కళ్ళెదురుగా హండ్రడ్ డేస్ సినిమా చూపించేస్తారు. మెహర్ రమేష్ కూడా అలాంటి దర్శకుడే. అయితే, కంత్రి, బిల్లా, శక్తి... వంటి మూడు భారీ చిత్రాలు డైరెక్ట్ చేసినప్పటికీ ఇంతవరకు ఒక్కటీ హిట్ కాలేదు. ఈ నేపథ్యంలో వెంకటేష్ లాంటి తెలివైన హీరో కూడా మెహర్ రమేష్ కి తాజాగా ఛాన్స్ ఇచ్చాడంటే అతను కథ చెప్పే పధ్ధతి ఎలాంటిదో ఊహించుకోవచ్చు. ఆమధ్య 'సింహా' వంటి హిట్ చిత్రాన్ని నిర్మించిన పరుచూరి కిరీటి ఇప్పుడీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది యాక్షన్ ఓరిఎంటేడ్ ఫిలిం గా రూపొందుతుందట. దీనికి గోపీ మోహన్, కోన వెంకట్ రచన చేస్తున్నారు. సంక్రాంతి వెళ్లాక జనవరిలోనే ఈ చిత్రం షూటింగు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో వెంకటేష్ పక్కన రిచాగంగోపాద్యాయ కథానాయికగా ఎంపికైంది.

No comments:

Post a Comment

Hyderabad

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2013. cininewsportal - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger