Wednesday 21 December 2011

Bodyguard stands number one in Snakranti race...........

రేపు సంక్రాంతికి రిలీజయ్యే సినిమాలన్నిట్లోకీ వెంకటేష్ నటించిన 'బాడీగార్డ్' నెంబర్ వన్ సినిమా అవుతుందా? మిగతా సినిమాలన్నీ ఇక అంతేనా? ఈ చిత్ర దర్శకుడు మలినేని గోపీచంద్ మాటల వరస చూస్తే అలాగే వుంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా జరిగిన ప్రెస్ మీట్లో గోపీచంద్ అలాగే చెప్పాడు మరి. "సంక్రాంతికి విడుదలయ్యే అన్ని సినిమాలలోనూ ఇదే నెంబర్ వన్ అవుతుంది" అన్నాడు. అతని మాటలకు అంతా స్టన్ అయ్యారు. ఏమిటిలా అనేస్తున్నాడు? మహేష్ బాబు 'బిజినెస్ మేన్' సంగతేంటి? ఇంకా బాలకృష్ణ 'అధినాయకుడు' మాటేమిటి? అనుకున్నారంతా. అది గ్రహించిన నిర్మాత బెల్లంకొండ సురేష్ వెంటనే దర్శకుడి స్టేట్మెంట్ ని సవరించే ప్రయత్నం చేశాడు. "ఆయననేది... ఇంతవరకు రిలీజయిన వెంకటేష్  సంక్రాంతి సినిమాలలో ఈ బాడీగార్డ్ నెంబర్ వన్ అవుతుంది...అని... మరోలా అనుకోకండి... గోపీ అలా అనబోయి పొరబాటున ఇలా అన్నాడు... అంతే" అంటూ దానిని కరెక్ట్ చేశాడు. గోపీచంద్ మరి నిజంగానే అన్నాడా? లేక నోరుజారాడా?

No comments:

Post a Comment

Hyderabad

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2013. cininewsportal - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger