Monday 19 December 2011

samantha acceptsa new movie with pavan kalyan

 వంశీ పైడిపల్లి డైరెక్షన్లో రామ్ చరణ్ నటిస్తున్న 'ఎవడు' సినిమాలో కథానాయికగా నటిస్తున్న సమంతా, త్వరలో పవన్ కల్యాణ్ సరసన కూడా నటించనుంది. డ్యాన్స్ మాస్టర్ రాజుసుందరం దర్శకత్వంలో పవన్ కల్యాణ్ ఓ సినిమాలో నటించడానికి అంగీకరించిన సంగతి తెల్సిందే. తమిళ దర్శకుడు యస్.జె.సూర్య కథ సమకూర్చిన ఈ చిత్రంలో కథానాయికగా నటించడానికి సమంతా అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం షూటింగు కొత్త సంవత్సరంలో ప్రారంభమవుతుంది. అసలు ఈ చెన్నయ్ ముద్దుగుమ్మ పవన్ కల్యాణ్ తో ఇంతకు ముందే నటించాల్సివుంది. అయితే, డేట్స్ సమస్య వల్ల వీలుపడలేదు. దీంతో బాబాయ్, అబ్బాయిలతో నటించే చాన్సును ఈ భామ కొట్టేస్తోంది. పవన్ ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్లో రూపొందుతున్న 'గబ్బర్ సింగ్' సినిమాలో నటిస్తున్నాడు.
 

No comments:

Post a Comment

Hyderabad

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2013. cininewsportal - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger