Wednesday 21 December 2011

Poolarangadu song shooting ............

కమేడియన్ సునీల్ హీరోగా నటిస్తున్న 'పూలరంగడు' చిత్రం మొదట ప్రకటించినట్టుగా సంక్రాంతికి విడుదల కావడం లేదంటూ ఇటీవల మీడియాలో వస్తున్న వార్తలకు చిత్ర నిర్మాతలు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమా షూటింగుకు సంబంధించి కేవలం మూడు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలివుందని నిర్మాత అచ్చిరెడ్డి చెప్పారు. చిత్రాన్ని సంక్రాంతికే రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. 'అహ నా పెళ్ళంట' చిత్రాన్ని డైరెక్ట్ చేసిన వీరభద్రం చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పాటల చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతోందని అచ్చిరెడ్డి చెప్పారు. మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరుగుతోందన్నారు. 450 థియేటర్లలో జనవరి 14 న ప్రపంచవ్యాప్తంగా దీనిని రిలీజ్ చేస్తున్నామన్నారు. ఈ 'పూలరంగడు' సినిమాలో సునీల్ కొత్త యాంగిల్ లో కనిపిస్తారని దర్శకుడు చెప్పారు. ఇందులో సునీల్, ఇషా చావ్లా జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.

No comments:

Post a Comment

Hyderabad

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2013. cininewsportal - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger