Sunday 18 December 2011

యన్టీఆర్ తో మరోసారి జోడీ కడుతున్న కాజల్ .....

నిన్నటి దాకా టాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసి, ఇటీవల పరుగు పందెంలో కాస్త వెనుకపడిన కథానాయిక కాజల్ మళ్లీ ఊపందుకుంటోంది. ప్రస్తుతం మహేష్ బాబుతో 'బిజినెస్ మెన్' సినిమాలో నటిస్తున్న ఈ భామ, తమిళంలో రెండు మూడు సినిమాలు చేస్తోంది. అలాగే, వినాయక్ డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా రూపొందే చిత్రంలో కూడా నటించనుంది. ఇదిలా ఉంచితే, ఆమధ్య యన్టీఆర్ తో 'బృందావనం' సినిమాలో నటించిన కాజల్, మళ్లీ మరోసారి అతనితో జోడీ కట్టనుంది. యన్టీఆర్ హీరోగా రూపొందనున్న ఓ సినిమాకి తాజాగా ఆమె సైన్ చేసిందట. అయితే, అది శ్రీను వైట్ల డైరెక్షన్లో రూపొందే సినిమానా? లేక మరొకటా? అన్నది తెలియాల్సివుంది!

No comments:

Post a Comment

Hyderabad

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2013. cininewsportal - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger