Monday 19 December 2011

new movie dorakadu in vishnu.....

ఇటీవలే కవల పిల్లలకు తండ్రి అయిన హీరో మంచు విష్ణు ప్రస్తుతం అమెరికాలో వున్నాడు. ఈ నెలాఖరుకి ఇండియా తిరిగి రాగానే, తన తదుపరి చిత్రం పనులలో బిజీ అవుతాడు. విష్ణు తన తాజా చిత్రాన్ని కామెడీ చిత్రాల దర్శకుడు జి.నాగేశ్వర రెడ్డి డైరెక్షన్లో చేయనున్నాడు. దీనికి సంబంధించిన సబ్జెక్ట్ కూడా ఇప్పటికే రెడీ అయింది. కామెడీ కథతో వినోదాత్మకంగా సాగే ఈ చిత్రానికి 'దొరకడు' అనే టైటిల్ పెడుతున్నట్టు తెలుస్తోంది. కథకు ఈ టైటిల్ సరిగ్గా సరిపోవడంతో దీనికే అందరూ మొగ్గుచూపుతున్నారు. ఇందులో విష్ణు పాత్ర సరదా సరదాగా గమ్మత్తుగా సాగుతుందట. ఈ సినిమాలో హన్సిక కథానాయికగా నటించే అవకాశం వుంది. కోన వెంకట్ దీనికి రచన చేస్తున్నారు. ఆమధ్య విష్ణు చేసిన 'వస్తాడు నా రాజు' సినిమా సక్సెస్ కాలేదు. ఈ నేపథ్యంలో ఎలాగైనా విజయం సాధించాలన్న ఉద్దేశంతో కామెడీ సబ్జెక్ట్ ను ఎంచుకున్నారట!

No comments:

Post a Comment

Hyderabad

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2013. cininewsportal - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger