Wednesday 21 December 2011

Priyanka Chopra admits she was offered Heroin....

బాలీవుడ్ దర్శకుడు మాధుర్ బండార్కర్ తాజాగా కరీనా కపూర్ కథానాయికగా రూపొందిస్తున్న 'హీరోయిన్' సినిమాని ముందుగా ప్రియాంకా చోప్రాకు ఆఫర్ చేశాడట. ఈ విషయాన్ని ప్రియాంకానే ఈ రోజు వెల్లడించింది. అయితే, గతంలో తాను చేసిన 'ఫ్యాషన్' సినిమా కథకీ, దీనికి దగ్గర పోలికలు బాగా ఉండడంతో తిరస్కరించానని ఆమె చెబుతోంది. "మాధుర్, నేను ఈ సినిమా గురించి చాలా మాట్లాడుకున్నాం. నేను ఈ సినిమా చేస్తే 'ఫ్యాషన్' సినిమానే మళ్లీ చేసినట్టుంటుంది. కొత్తదనం వుండదు. ఆ విషయాన్ని మాధుర్ కి వివరించాను. అందుకే నేను యాక్సప్ట్ చేయలేదు. కరీనా కపూర్ మాత్రం పెర్ఫెక్ట్ సెలెక్షన్. ఆమెకిది తప్పకుండా వెరైటీ అవుతుంది" అంటోంది ప్రియాంకా. అంటే... తాను ఎప్పుడో చేసేసిన కథను 'నెంబర్ వన్' హీరోయిన్ కరీనా ఇప్పుడు చేస్తోందనే కదా... దీనర్ధం?

No comments:

Post a Comment

Hyderabad

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2013. cininewsportal - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger