Wednesday 21 December 2011

Shobhana turns as director

నిన్నటి తరం కథానాయికలలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న నటిగా శోభన పేరు చెప్పుకోవాలి. కళ్ళతోనే అభినయాన్ని ప్రదర్శించగల అతికొద్దిమంది ఆర్టిస్టుల్లో ఆమె ఒకరు. 'అభినందన', 'రుద్రవీణ', 'కోకిల', 'అల్లుడుగారు', 'రౌడీ అల్లుడు' వంటి చిత్రాలలో ఆమె చూపిన అభినయం అందర్నీ అలరించింది. క్లాసికల్ డ్యాన్సర్ గా ఆమె తనదైన ముద్ర వేసింది. గత కొన్నాళ్ల నుంచీ నటనకు దూరంగా ఉంటూ, శాస్త్రీయ నృత్యప్రదర్శనలిస్తోంది. నటన పరంగా తనకున్న అనుభవంతో త్వరలో ఓ చిత్రానికి దర్శకత్వం వహించడానికి శోభన సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం నృత్య ప్రధానంగా ఉంటుందని అంటున్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఆమె ప్లాన్ చేస్తోందట.

No comments:

Post a Comment

Hyderabad

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2013. cininewsportal - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger