Monday 19 December 2011

అసూయ వెళ్ళగక్కిన సెక్సీతార

 బాలీవుడ్ అందాల కథానాయిక కత్రినాకైఫ్ ని చూస్తే, ఐటెం గాళ్ రాఖీసావంత్ కి అసూయ పెరిగిపోతోంది. ఒళ్లు కూడా మండిపోతోంది. అసలు ఒరిజనల్ ఐటెం గాళ్ తానైతే మధ్యలో వచ్చిన కత్రినా పెద్ద ఐటెం గాళ్ గా పేరు తెచ్చేసుకోవడం ఆమెకు ఎంత మాత్రం నచ్చడం లేదు. అందుకే, ఈవేళ కత్రినా మీద ఓ ఫంక్షన్లో తన అసూయను వెళ్ళగక్కింది. ఐటెం సాంగుల్లో కేట్ తనని కాపీ చేస్తోందని బాహాటంగా ఆరోపించింది. తన హావభావాలను, డ్యాన్సుల్నీ మక్కీకి మక్కీ దించేస్తోందంటూ రెచ్చిపోయింది. "అగ్నిపధ్ రీమేక్ లో కేట్ చేసిన 'చిక్నీ చమేలీ' సాంగ్ చాలా బాగుంది. తను బాగా డ్యాన్స్ చేసింది. కానీ, ఇందులో కొత్తదనం ఏమీ లేదు. ఇవన్నీ నేనెప్పుడో చేసేశాను. నా పాటలు చూడండి... మీకే తెలుస్తుంది" అంటోంది రాఖీ. 'దేక్తా హై తూ క్యా...' పాటలో నేను చేసిన డ్యాన్స్ ని తను 'షీలాకీ జవానీ'లో చేసింది. అలాగే, 'చిక్నీ చమేలీ'లో కూడా నన్నే ఫాలో అయింది. ఏమైనా, నన్ను మరొకరు అనుకరిస్తున్నారంటే మంచిదేగా?" అంటూ చురకంటించింది. ఇంతకీ, ఇది నిజమేనా... అంటూ బాలీవుడ్ జనం నవ్వుకుంటున్నారు!

No comments:

Post a Comment

Hyderabad

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2013. cininewsportal - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger