Sunday 18 December 2011

నిన్న సమంతా... నేడు తమన్నా! ...........hot news fot tollywood news...

తన దగ్గర అడ్వాన్స్ తీసుకుని తమ సినిమాకు కథానాయిక సమంతా డేట్స్ కేటాయించడం లేదంటూ నిర్మాత బెల్లంకొండ సురేష్ మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ కూ, ప్రొడ్యుసర్ కౌన్సిల్ కూ ఇటీవల ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమస్యను అసోసియేషన్ పెద్దలు సామరస్యపూరకంగా పరిష్కరించారు. ఈ గొడవ ఇంకా సద్దుమణగక ముందే మరో కథానాయిక తమన్నాపై మరో నిర్మాత స్రవంతీ రవికిషోర్ (హీరో రామ్ పెదనాన్న) కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. రామ్ కథానాయకుడుగా కరుణాకరన్ డైరెక్షన్లో ఆయన నిర్మిస్తున్న 'ఎందుకంటే... ప్రేమంట' సినిమాకి తమన్నా డేట్స్ ప్రాబ్లం చేస్తోందట. దాంతో తమ చిత్ర నిర్మాణం ఆలస్యమవుతోందని ఆయన ఆరోపిస్తున్నారు. తమన్నా ప్రస్తుతం ఈ చిత్రంతో బాటు, 'రచ్చ', 'రెబల్' సినిమాలలో నటిస్తోంది. ఆమె డేట్స్ లభ్యతను బట్టి ముగ్గురు నిర్మాతలూ తమ తమ సినిమా షూటింగులను ప్లాన్ చేసుకోవాలని నిర్మాతల మండలి సూచించినట్టు తెలుస్తోంది.

No comments:

Post a Comment

Hyderabad

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2013. cininewsportal - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger