Wednesday 21 December 2011

Madhuri getting no offers..............

తాను మళ్లీ నటిస్తానంటే తన ఇంటి ఎదురుగా నిర్మాతలు డబ్బు సంచులు పట్టుకుని, క్యూ కట్టేస్తారని భావించి, అమెరికా నుంచి ఇండియాకి వచ్చేసిన నిన్నటి గ్లామర్ తార మాధురీ దీక్షిత్ కి నిరాశే ఎదురవుతోంది. ఆమె ఆశించినంత స్థాయిలో ఆఫర్లేమీ రావడం లేదట. దాంతో ప్రస్తుతం గోళ్లు గిల్లుకుంటూ ఇంట్లో కూర్చుంది. ఒకవేళ కొత్త సంవత్సరం వేడుకలకు సంబంధించి స్టేజ్ పెర్ఫార్మెన్స్ ప్రోగ్రామ్స్ వస్తే చేద్దామన్న ఉద్దేశంతో, తన మేనేజర్ ద్వారా కొన్ని ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థల్ని కూడా సంప్రదించిందనీ, అక్కడ నుంచి కూడా పెద్దగా స్పందన లేదనీ బాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తల్ని ఆమె మేనేజర్ రికూ ఖండిస్తున్నాడు. న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి మాధురీకి మూడు కోట్ల వరకు ఆఫర్స్ వచ్చాయనీ, అయితే తన కుటుంబ సభ్యులతో గడపడానికే ఆమె ప్రాధాన్యత ఇవ్వడంతో వాటిని తిరస్కరించడం జరిగిందనీ రికూ అంటున్నాడు. ఏమైనా, మాధురీ బాలీవుడ్ లో ఎప్పుడు బిజీ అవుతుందో చూడాలి!

No comments:

Post a Comment

Hyderabad

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2013. cininewsportal - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger