Sunday 18 December 2011

shekar kammulla this time changed his style...upcoming movie inn...........

'లీడర్' సినిమా తను అనుకున్నట్టుగా ప్రేక్షకాదరణ పొందకపోవడంతో దర్శకుడు శేఖర్ కమ్ముల తిరిగి తన పాత స్టయిల్లోకి వచ్చేశాడు. ప్రస్తుతం తాను రూపొందిస్తున్న 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' చిత్రం గతంలో తాను రూపొందించిన 'ఆనంద్', 'హ్యాపీడేస్' వంటి సరదా సరదాగా సాగిపోయే ప్రేమకథ అని చెబుతున్నాడు. ఈ చిత్రంలో ఆర్టిస్టులందర్నీ కొత్తవాళ్లనే తీసుకున్నాడు. సినిమా షూటింగ్ అంతా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తున్నారు. మొదట్లో ఈ చిత్రాన్ని జనవరి 26 న రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే, సాంకేతిక కారణాల వల్ల ఫిబ్రవరి 3 కి వాయిదాపడింది. ఇక ఈ చిత్రానికి సంబంధించి ఒక్క స్టిల్ కూడా బయటకు రాలేదు. మొత్తం అంతా అయ్యాక ఒక్కసారిగా ప్రమోషన్ స్టార్ట్ చేయాలని శేఖర్ ప్లాన్ చేశాడట.

No comments:

Post a Comment

Hyderabad

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2013. cininewsportal - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger