Tuesday 13 December 2011

new movie of raviteja..............upcoming movies deatils of ravi teja new movie........

రవితేజ హీరోగా శ్రీ వెంకటేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బూరుగపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్న చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. డిసెంబర్ 11 నుంచి రెండో షెడ్యూల్ మొదలైంది. ఈ సందర్భంగా దర్శకుడు శివ మాట్లాడుతూ “పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమిది. రవితేజకు మాస్‌లో ఉన్న ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని అతని బాడీలాంగ్వేజ్‌కు తగ్గట్టుగా తయారు చేసిన కథ ఇది. రవితేజ పాత్రలో ఐదు షేడ్స్ ఉంటాయి. ఇలాంటి పాత్రను రవితేజ తొలిసారి చేస్తున్నారు. ఎ, బి, సి అనే తేడా లేకుండా అన్ని సెంటర్ల ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా ఉంటుంది. వినోదం కోసం వచ్చేవారికి వంద శాతం వినోదం ఈ చిత్రంలో లభిస్తుంది. ముఖ్యంగా రవితేజ, బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. ఈ చిత్రం తొలి షెడ్యూల్ హైదరాబాద్, చెన్నైలో జరిగింది. రెండో షెడ్యూల్ సినిమా పూర్తయ్యేవరకు జరుగుతుంది. పాటల్ని విదేశాల్లో చిత్రీకరిస్తాం. వేసవిలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని అన్నారు.

                                                  balu....********************

No comments:

Post a Comment

Hyderabad

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2013. cininewsportal - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger